Sunday, April 1, 2018

చాటుపద్యం


చాటుపద్యం


సాహితీమిత్రులారా!


అల్పులైకూడ అధికులను అపహసించే
ప్రజల తత్వాన్ని చాటిచెప్పే చాటుపద్యం
చూడండి -

పరగగ నాల్గు పాదముల బాగుగ తుండము ఘీంకృతంబు మా
కిరువురకున్ సమంబె మఱి యెక్కువ యెక్కటి పక్షయుగ్మ ఖే
చరుఁడను నాకు సామ్య మొక సామజమా? యని దోమ పల్కు న
ట్లరయ మహానుభావులను నల్పుఁడు నోరికొలందు లాడె డిన్

ఇందులో ఒక దోమ ఏనుగుతో పోల్చుకొంటూ
తను ఏనుగుకంటే ఎక్కువ అంటూంది
ఎలాగంటే ఏనుగు ఒక తొండముంది
నాలుకాళ్లున్నాయి నాకు అలాగే ఒక తొండం
నాలుగుకాళ్లున్నాయి ఇంకా నాకే ఆకాశంలో
ఎగురగల శక్తి వుంది అంటూంది.
దీని పరిమాణం ఎంత దానికి పరిమాణం ఎంత
అదే ప్రజల మనస్తత్వం. అవతలి వాడెంతటి వాడైనా
తను అతనికంటే గొప్ప అని చెప్పుకోవడం.

No comments:

Post a Comment